కోటీశ్వరులైనా కడుపేదలైనా

Telugu Christian Song

కోటీశ్వరులైనా కడుపేదలైనా అందరు కాటికే పోవాలి అభిమానులేవున్నా అనామకులైనా అందరు అంతమైపోవాలి దిగంబరులుగానే వొచ్చాము దిగంబరులుగానే వెళ్లిపోవాలి అంతాతిరిగి మట్టికే పోతాము ఇంతా తెలిసి ఎగిరెగిరి పడతాము చరణం 1: సిరిసంపదలెన్ని కూడబెట్టినా చిళ్లిగవ్వైనా తీసుకెళ్లలేమని ఒక్కజేబుకూడాలేని ప్రేతవస్త్రం చాటేసత్యాన్ని ఎరుగవెందుకు? భార్యాబిడ్డలా బంధుమిత్రుల బంధం బ్రతికున్నంతవరకే పరిమితం చేసిన పనుల ఫలముగ వెళ్లేలోకమే మన అందరికి శాశ్వతం ఏదిమన శాశ్వతం ఓ మనసా? ఏది నిజసంపదో అదితెలుసా? కోటీశ్వరులైనా కడుపేదలైనా అందరు కాటికే పోవాలి అందరు అంతమైపోవాలి చరణం 2: ఆస్తులను అప్పులను ఐనవారికి విడిచిపెట్టి వెళ్లిపోతాము పాపపుణ్య
Telugu