కరుణ కటాక్షము
కరుణ కటాక్షము
కరుణ కటాక్షము గల యేసయ్యా
నను విస్తరింపజేయు మహనీయ |2|
దివ్య సుందరమ - దయకు నిలయమ
దివిలో కాంతితేజమా
పరిమళ నామమ - ప్రేమకు నిలయమ
పరిశుద్ధ స్తుతి గానమా |2|
|కరుణ కటాక్షము|
1. ఏమున్నదనీ నాపై లక్ష్యముంచినావు
ఆదరించి ప్రేమించి కటాక్షించినావు |2|
నీ రెక్కల నీడే సురక్షితం
నీ పాద సన్నిధె క్షేమము |2|
కృపవెంబడి కృపను - నిత్యమైన ప్రేమను
అధికమైన మహిమను విస్తరింపజేసావు |2|
|కరుణ కటాక్షము|
2. నేనెంతటి వాడనని ఇంతగ హెచ్చించావు
ఏలుటకు ఎన్నుకొని అభిషేకించావు |2|
నీ ఇష్టునిగా నివసించెదను
నీ ఉద్దేశము నే మరువను