కరుణాసాగర యేసయ్యా
కనుపాపగా నను కాచితివి
ఉన్నతమైన ప్రేమ తో
మనసున మహిమగా నిలిచితివి (2)
1. మరణపు లోయలో దిగులు చెందక
అభయము నొందితిని నిన్ను చూచి (2)
దాహము తీర్చిన జీవ నది
జీవ మార్గము చుపితివి (2) " కరుణా "
2. యోగ్యత లేని పాత్రను నేను
శాశ్వత ప్రేమ తో నింపితివి (2)
ఒదిగితిని నీ కౌగిలి లో
ఓదార్చితివి వాక్యముతో (2) " కరుణా "
3. అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు
సర్వ సత్యము లో నడిపితివి (2)
సంపూర్ణ పరచి జ్వేష్టుల తో
ప్రేమ నగరి లో చేర్చుమయా (2) " కరుణా "
--Karunaa saagara yesayya--