కరుణించవా నా యేసువా

Telugu Christian Song

కరుణించవా నా యేసువా ఓదార్చవా నజరేతువా (2) నీ కృపలో అనుదినము రక్షించవా నీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా (2) ||కరుణించవా|| నిరాశ నిస్పృహలతో కృంగిన వేళ బలమైన శోధన నను తరిమిన వేళ (2) మిత్రులే శత్రువులై దూషించిన వేళ (2) లోకమే విరోధమై బాధించిన వేళ (2) ||కరుణించవా|| ఆత్మీయ యాత్రలో నీరసించు వేళ నీ సిలువ పయనంలో అలసిపోవు వేళ (2) సాతాను పోరాటమే అధికమైన వేళ (2) విశ్వాస జీవితమే సన్నగిల్లు వేళ (2) ||కరుణించవా|| --Karuninchava naa yesuva oodarchava--
Telugu
1 views