కృపగల దేవా దయగల రాజా

Telugu Christian Song

కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహు ఘనతేగా నీ చరణములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని (2) సర్వాధికారి నీవే దేవా – నా సహకారి నీవే ప్రభువా నా కోరికలే సఫలము చేసి – ఆలోచనలే నెరవేర్చితివి అర్పించెదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించెద నీలో దేవా (2) ||కృపగల|| త్రోవను చూపే తారవు నీవే గమ్యము చేర్చే సారథి నీవే (2) జీవన యాత్రా శుభప్రదమాయే నా ప్రతి ప్రార్థన పరిమళమాయె నీ ఉదయకాంతిలో నను నడుపుము నా హృదిని నీ శాంతితో నింపుము (2) ||కృపగల|| కృప చూపి నన్ను అభిషేకించి వాగ్ధానములు నెరవేర్చినావే (2) బహు వింతగా నను ప్రేమించినావే బలమైన జనముగా నను మార్చినావే నీ కీర్తి జగమంత వివరింతును నీ దివ
Traditional
Telugu