కృపలను తలంచుచు - ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్ (2X)
1. మిమ్మును ముట్టినవాడు - నా కంటి పాపను (2X)
ముట్టునని సెలవిచ్చిన దేవుడు - కాచెను గతకాలం నన్ను
...కృపలను...
2. రూపింపబడుచున్న - ఏ ఆయుధముండినను (2X)
నాకు విరోధమై వర్ధిల్లదుయని - చెప్పిన మాట సత్యం ప్రభువు
...కృపలను...
3. కన్నీటి లోయలలో - నే కృంగిన వేళలో (2X)
నింగిని చీల్చి వర్షము పంపి - నింపెను నా హృదయం! యేసు
...కృపలను...
4. సర్వోన్నతుడైన - నా దేవునితో చేరి (2X)
సతతము తన కృప వెల్లడి చేయు - స్తుతులతో నింపెను యిలలో
...కృపలను...
5. హల్లెలూయ ఆమేన్ - ఆ..., నాకెంతొ ఆనందమే (2X)
సీయోన్ నివాసం - నాకెంతొ ఆనందం - ఆనందమానందమే - ఆమేన్
...క