కృతజ్ఞతా స్తోత్రములు నా ప్రభువునకు
ఆయన దయ నా పైన నిత్యము ఉన్నది (2)
నా పాపములను క్షమించి
నా వ్యాధులను స్వస్థపరచెను (2)
హల్లెలూయా హల్లెలూయా
యెహోవాకు స్తోత్రము చెల్లింతును
హల్లెలూయా హల్లెలూయా
నా దేవునికి వందనము అర్పింతును (2) ||కృతజ్ఞతా||
నాశనము నుండి రక్షించెను
కృపా కరుణలతో కిరీటము పెట్టెను (2)
నా కోరికలను తృప్తిపరచెను
నా యౌవనము పునరుద్ధరించెను (2) ||కృతజ్ఞతా||
ఆయన నీతిని తెలియజేసెను
బాధపడువారికి న్యాయము చేసెను (2)
దయా సహనము గలవాడు
కృపా వాత్సల్యము విస్తారము (2) ||కృతజ్ఞతా||
--Kruthagnathaa sthothramulu naa prabhuvunaku--