కృతజ్ఞతన్ తలవంచి

Telugu Christian Song

కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును లేదే ఇక-నే ఈవి ఇల అర్పింతును నన్నే నీకు (2) దూరమైతి నీ ప్రేమ మరచి నే రేపితి నీ గాయముల్ (2) దూరముగా నిక వెళ్ళజాల కూర్చుండెద నీ చెంతనే (2) ||కృతజ్ఞతన్|| ఆకర్షించే లోకాశాలన్ని లోక మహిమ నడ్డగించు (2) కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై నిక్కముగా త్యజింతును (2) ||కృతజ్ఞతన్|| తరముల నీ ప్రేమ నాకై వర్ణింపను అశక్యము (2) నిరంతరము సేవించినను తీర్చలేను నీ ఋణము (2) ||కృతజ్ఞతన్|| --Kruthagnathan thalavanchi naadu jeevamu--
Telugu