కురిసింది నవ్వుల వాన

Telugu Christian Song

కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి – నాలో కలిగే సవ్వడి హృదయాలు పండించే వేళ ఈవేళ /కురి/ ​1. కోయిలమ్మ పాడె అందమైన ఏదో రాగం దాగెనమ్మ సిగ్గు తొందరల్లో ఏదో భావం ఒంటరి జీవితం జంటగ మార్చెనే – ఇరు హృదయాలను ఒకటిగా కూర్చెనే దేవుడు కల్పిన బంధం – వీడిపోని అనుబంధం /కురి/ గోరుమావిడమ్మా పూచెనమ్మా అనురాగం మరువకూడదమ్మా చేసుకున్న ఈ ప్రమాణం వాక్యపు వెలుగులో బ్రతుకులు పండగా దేవుడు తోడుగా నీతో నుండగా సాగేటి ఈ బంధం – వీడిపోని అనుబంధం /కురి/ --Kurisindi navvula vaana vivaha--
Telugu