కురిసింది తొలకరి వాన నా గుండెలోన

Telugu Christian Song

కురిసింది తొలకరి వాన నా గుండెలోన చిరుజల్లులా ఉపదేశమై - నీ వాక్యమే వర్షమై నీ నిత్య కృపయే వాత్సల్యమై నీ దయయే హెర్మోను మంచువలె (2) పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించెద నా యేసయ్య (2) ( కురిసింది ) 1. దూలినై పాడైన ఎడారిగా నను చేయక జీవజల ఊటలు ప్రవహింపజేశావు (2) కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనియక సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు (2) స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయాసాగరా (2) ( పొంగి పొరలి ) 2. నీ మందిర గుమ్మములోని ఊటలతో శుద్ధి చేసి నాచీల మండలమునకు సౌందర్యమిచ్చితివి (2) నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కోల్పోనీయక నీ ప్రభావ మేఘముతో సాక్షిగా నను నడిపితివి (2)
Hosanna ministries
Telugu