క్రీస్తుజన్మించె నేడు - కాంతి

Telugu Christian Song

క్రీస్తుజన్మించె నేడు - కాంతి ఉదయించెనే మహిమ విడిచొచ్చినాడు - మనిషిగా పుట్టెనే మరణాంధకారమందు - మహిమను నింపుటకు మనవంటి వాడాయెను - మనసున్న మహారాజు "సంతోష సంబరమే - శాశ్వత ఆనందమే " 1.ప్రవచనములు నెరవేరునట్లు - పుడమిలో పుట్టెను కన్యమరియ గర్భమునందు - శిశువై జన్మించెను వెలుగు విరజిమ్ముచూ - భ్రమలు తొలగించగా ఇలకు అరుదెంచెను - దైవకుమారుడు యేసుక్రీస్తుగా 2.సర్వోన్నతమగు స్థలములయందు - దేవునికే మహిమ అనుచూ దూతలందరు నింగిలో చేరి - ఆరాధన చేసిరి మనమందరము చేరి - స్తుతులు అర్పించెదం రాజులకు రాజని -క్రొత్త కీర్తనలు పాడి కీర్తించెదము --Kreesthu janminche nedu kaanthi udayinchene--
Telugu