క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు
మధుర స్వరమేయది మెల్లని స్వరమేయది – (2)
యెహోవా నీ స్వరము జలములపై వినబడెను (2)
మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను (2) ||క్రీస్తుని||
బలమైన నీ స్వరము బహుప్రభావము గలది (2)
దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని (2) ||క్రీస్తుని||
అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును (2)
ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును (2) ||క్రీస్తుని||
ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్ (2)
ఆశీర్వాదము శాంతి నొసగునాయన స్వరమే (2) ||క్రీస్తుని||
నీ మధుర స్వరము నీ వాక్యమును విందున్ (2)
ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు (2) ||క్రీస్తుని||