కృపామయుడా - నీలోనా - నివసింప జేసినందునా (2X)
యివిగో నా స్తుతుల సింహాసనం - నీలో నివసింప జేసినందునా
...కృపామయుడా..ఆ..
1. ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక (2X)
నా మార్గములన్నిటిలొ.. - నీవె ఆశ్రయమైయుండగా (2X)
...కృపామయుడా..ఆ..
2. చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలిచిన తేజోమయా (2X)
రాజవంశములో.. - యాజకత్వము చేసేదను (2X)
...కృపామయుడా..ఆ..
3. నీలో నిలచి ఆత్మఫలములు ఫలియించుట కొరకే (2X)
నాపైనా నిండుగా.. ఆత్మవర్షము క్రుమ్మరించు (2X)
...కృపామయుడా..ఆ..
4. ఏ యోగ్యత లేని నాకు - జీవకిరీటమిచ్చుటకు (2X)
నీ కృప ననువీడకా.. - శాశ్వత కృపగా మారెను (2X)
...కృపామయుడా..ఆ..
--Krupamayuda nee lona --