కృపా సత్యా సంపూర్ణుడా
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా (2X)
నా సన్మానానికే - మహనీయుడవు నీవేనయ్యా (2X)
1. యెఱ్ఱ సముద్రము నీ ఆజ్ఞ మేరకు - రహదారిగ మారగా (2X)
దాటిరే నీ జనులు బహు క్షేమముగా
ఆ జలముల లోనే శత్రు సైన్యము మునిగిపోయెనే (2X)
...కృపా...
2. నూతన క్రియను చేయుచున్నానని - నీవు సెలవీయ్యగా (2X)
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారి పోయెనె (2X)
...కృపా...
3. నైవేద్యములు దహన బలులు - నీవు కోరవుగా (2X)
నా ప్రాణాత్మ శరీరము బలి యర్పణ కాగా
నా జీహ్వ బలులు స్తోత్ర బలులుగ మారి పోయెనే (2X)
...కృపా...
--Krupa sathya sampoornuda sarvalokanike--