లాలిలాలి లాలి లాలమ్మ లాలీ

Telugu Christian Song

లాలిలాలి లాలి లాలమ్మ లాలీ లాలియని పాడరే బాలయేసునకు |లాలి| 1. పరలోక దేవుని తనయుఁడో యమ్మా పుడమిపై బాలుఁడుఁగఁ బుట్టెనో యమ్మా |లాలి| 2. ఇహ పరాదుల కర్త యీతఁడో యమ్మ మహి పాలనముఁ జేయు మహితుఁడో యమ్మా |లాలి| 3. ఆద్యంతములు లేని దేవుఁడో యమ్మా ఆదాము దోషమున కడ్డు పడె నమ్మా |లాలి| 4. యూదులకు రాజుగాఁబుట్టెనో యమ్మా యూదు లాతని తోడ వాదించి రమ్మా |లాలి| 5. నరగొఱ్ఱెల మంద కాపరో యమ్మా గొరియల ప్రాణంబు క్రీస్తు తానమ్మా |లాలి| --Laali laali laali laalamma laali--
Telugu