లేచినాడురా సమాధి గెలచినాడురా

Telugu Christian Song

లేచినాడురా సమాధి గెలచినాడురా (2) యేసు లేతునని తా చెప్పినట్లు (2) లేఖనములలో పలికినట్లు ||లేచినాడురా|| 1. భద్రముగా సమాధిపైన పెద్ద రాతిని ఉంచిరి భటులు (2) ముద్ర వేసి రాత్రి అంతా (2) నిద్ర లేక కావలియుండ ||లేచినాడురా|| 2. పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు (2) నరక బాధ లేదు మనకు (2) పరమ తండ్రి యేసు ప్రభువు ||లేచినాడురా|| 3. యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం (2) యేసునందే ఆత్మ శాంతి (2) యేసునందే మోక్ష భాగ్యం ||లేచినాడురా|| 4. పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు (2) పాపులను ప్రేమించినాడు (2) ప్రాణ దానము చేసినాడు ||లేచినాడురా|| --Lechinad
Telugu