లేచినాడురా సమాధి గెలిచినాడురా - యేసు
లేచినాడురా సమాధి గెలిచినాడురా
అను పల్లవి: లేతునని తా జెప్పినట్లు - లేఖనములో పలికినట్లు
1. భద్రముగా సమాధిపైని - పెద్దరాతిని యుంచిరి భటులు
ముద్రవేసి రాత్రియంత - నిద్రలేక కావలియున్న
2. ప్రభువు దూత పరము నుండి - త్వరగా దిగి రాతిని పొర్లించి
భళిర దాని పై కూర్చుండె - భయము నొంద కావలివారు
3. ప్రొద్దు పొడవక ముందే స్త్రీలు - సిద్ధపరచిన సుగంధమును
శ్రద్ధ తోడ తెచ్చి యేసుకు - రుద్దుదామని వచ్చి చూడ
4. చూడ వెళ్ళిన స్త్రీలను దూత - చూచి యపుడే వారితోడ
లేడు గలిలయ ముందుగ పోతున్నాడు అపుడే లేచినాడని
5. చచ్చిపోయి లేచినాడు - స్వామి భక్తుల కగుపడినాడు
చచ్చినను నను లేపుతాడు - చావ