లెక్కింపగ తరమా నీ మేలులు

Telugu Christian Song

లెక్కింపగ తరమా నీ మేలులు వివరింపగ తరమా నీ కార్యములు (2) నీవిచ్చిన బహుమానం బహు శ్రేష్టము నీకిచ్చే స్తుతియాగం స్వీకరించుము (2) ||లెక్కింపగ|| నీ ప్రేమలోనే తను ఎదగాలి నీ రక్షణలోనే కొనసాగాలి (2) నీ సన్నిధి చేరి నీ జ్ఞానముతోని నిరతం నిన్నే స్తుతియించాలి తన జీవితమంతా నీ రెక్కల క్రింద నిన్నే ఎల్లప్పుడు సేవించాలి (2) ||లెక్కింపగ|| నీ వాక్యము తన హృదిలో ఉండాలి నీ తలంపులు మదిలో నిండాలి (2) నీ దయయందు మనుష్యుల దయయందు ప్రతి యేటా దీవెనలతో వర్ధిల్లాలి నీ ఆత్మ బలముతో స్థిరమైన మనస్సుతో ప్రతి చోట నీ సాక్షిగ జీవించాలి (2) ||లెక్కింపగ|| --Lekkimpaga tharama nee melulu--
Telugu