లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు

Telugu Christian Song

లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది ఇమ్ముగ ప్రభుని మహిమ ఇదిగో నుందయించె నీపై ||లెమ్ము|| 1. జనములు నీదు వెలుగునకు జనుదెంచెదరు గనుమ తనర నీ యుదయ కాంతికి తరలి రాజులు వత్తురు ||లెమ్ము|| 2. సముద్ర వ్యాపారంబు సరిత్రప్పబడు వీవైపు అమరుగ జనుల యైశ్వ ర్యము వచ్చు నీ యొద్దకు ||లెమ్ము|| 3. గొంజి దేవదారు సరళ వృక్షాలు నాలయమునకు ఎంచి తేబడు నాపాద క్షేత్రము గొప్పగజేతు ||లెమ్ము|| 4. నిత్యమౌ కాంతితోడ నిన్ను వెలుంగజేతు నిత్య సంతోషమునకు నిన్ను కారణముగ జేతు ||లెమ్ము|| 5. ఎంచంగ నొంటరిగాడె ఎసగు వేయిమందియై ఎంచంగ దగని నాడె ఎంతో బలమగు జనమగును ||లెమ్ము|| --Lemmu thejarillumu neeku velugu--
Telugu