లేత మొక్కలా తండ్రి సన్నిధిలో

Telugu Christian Song

లేత మొక్కలా తండ్రి సన్నిధిలో నిత్య మహిమలో ఎదిగావు లోక పాపములే నీ బుజముపై కల్వరి సిలువలో ఒదిగావు సొగసైననూ లేక సురూపమూ లేక బలియైతివా నా యేసయ్యా ॥2॥ నీ ప్రేమనే రక్తముగా మార్చితివే నా కొరకే యేసయ్యా ॥2॥ మృత్యుంజయుడా పునరుద్ధానుడవై ఆఖరి శత్రువునే గెలిచావు ॥2॥ పరలోక రాజ్యంలా ఈ భువినంతటిని నీ మహిమతో నింపావు ॥2॥ సమాధి సంకెళ్ళయినా మరణపు మళ్ళైన జయించితివా నా యేసయ్యా ॥2॥ నీ ఆత్మతో నను ముద్రించితివే నీ రాజ్యముకే యేసయ్యా ॥2॥ యేసయ్యా యేసయ్యా యేసయ్యా --Letha mokkala thandri sannidhilo--
Telugu
14 views