మా హృదయములలో దేవుని ప్రేమను

Telugu Christian Song

మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి మా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా ఆనందించెదము ఎల్లప్పుడు ఆనందించెదము ఆనందించెదము మేము ఆనందించెదము నీవిచ్చిన రక్షణను బట్టి ఆనందించెదము మాకిచ్చిన నిత్య జీవమును బట్టి ఆనందించెదము యేసు యేసు నీ ద్వారనే మేము దేవునితో సమాధానము కలిగియుంటిమి యేసు యేసు నీ వలనే కదా మేము నీతోడి దేవునికి వారసులమైతిమి ||మా హృదయములలో|| ఘోర పాపులము నీ తట్టు తిరిగితిమి కృపను చూపితివి పరిశుద్ధపరిచితివి మా అపరాధముల కొరకు అప్పగింపబడి మము నీతిమంతులుగా తీర్చుటకు లేపబడినావు మాకు నిత్య స్వాస్థ్యము నిశ్చయతను అనుగ్రహించుటకు పరిశుద్ధాత్మను సంచకరువుగా మాలో నింపితివి ||మా హృదయములలో||
Telugu
15 views