మాధుర్యమే నా ప్రభుతో జీవితం

Telugu Christian Song

మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే - మహా ఆశ్చర్యమే మహిమానందమే - మహా ఆశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం 1. సర్వ శరీరులు గడ్డిని పోలిన - వారై యున్నారు -2 వారి అందమంతయు -పువ్వువలె వాడిపోవును - వాడిపోవును ॥ మాధుర్యమే ॥ 2. నెమ్మది లేకుండ విస్తారమైన - ధనముండుట కంటె -2 దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు - ఉండుటే మేలు ॥ మాధుర్యమే ॥ 3. వాడబారని కిరీటమునకై - నన్ను పిలిచెను -2 తేజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో - ఎపుడు చేరెదనో ॥ మాధుర్యమే ॥ --Madhuryame naa prabhutho jeevitham--
Telugu