మానవుల మేలు కొరకు

Telugu Christian Song

మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు మానుగఁ కల్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా ||మానవుల|| 1. కానాయను నూరిలో మన కర్త చూచెఁ బెండ్లిని పానముగను ద్రాక్షరసము దాన మొసఁగెఁ బ్రీతిని ||మానవుల|| 2. యేసూ వీరిద్దరిని ఏకముగాఁ జేయుమీ దాసులుగను జేసి వీరి దోసము లెడబాపుమీ ||మానవుల|| 3. కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును బూర్తిగ నీ విచ్చి వీరిఁ బొందుగాను నడుపుమీ ||మానవుల|| 4. భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగులఁ జేయుఁమీ ||మానవుల|| --Maanavula melu koraku gnaniyaina devudu--
Telugu