మార్గం సత్యం జీవం నీవే యేసు

Telugu Christian Song

మార్గం సత్యం జీవం నీవే యేసు సర్వం సకలం నీవే క్రీస్తు (2) మా ఆధారం నీవేనయ్యా మా అనుబంధం నీతోనేనయ్యా (2) వధియింపబడిన ఓ గొర్రెపిల్ల ప్రభువైన మా యేసువా మా స్తుతి స్తోత్రముల్ నీకే మహిమా ప్రభావముల్ నీకే (2) ||మార్గం|| పరమును విడిచావు మాకై నరునిగా పుట్టావు ధరపై (2) ఆహా నీదెంత ప్రేమ ఎవరికైనా వర్ణింప తరమా (2) ||వధియింప|| కలువరిలో రక్తమును కార్చి విలువగు ప్రాణమును ఇచ్చి (2) తెచ్చావు భువికి రక్షణ ఇచ్చావు పాప క్షమాపణ (2) ||వధియింప|| --Maargam sathyam jeevam neeve yesu--
Telugu