మారదయా నీ ప్రేమ

Telugu Christian Song

మారదయా నీ ప్రేమ మార్పు రాదయా నీ ప్రేమలో (2) ఎన్ని మారినా మారని ప్రేమ (2) యేసయ్యా నాపై నీవు చూపుచుంటివా (2) ||మారదయా|| నిరీక్షించుచుంటిని నీ రాకకై వేగిరమే రమ్ము నను కొనిపోవుటకు (2) అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా|| (నాకు) ఆకాశమందు నీవు తప్ప లేరెవరు నా శ్రమలలో నాకు నీవే జవాబు (2) అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా|| నీ మాటలయందే ఆశ యేసయ్యా వాగ్ధానములు నాలో నెరవేర్చుమా (2) అప్పటి వరకు మారదు నాపై నీ ప్రేమ మారనే మారదు (2) ||మారదయా|| --Maaradaya nee prema--
Telugu