మారిపోవాలి ఈ లోకమంతా
చేరరావాలి ప్రభుయేసు చెంత ||2||
మంచి మనలోన పెంచాలి ఎప్పుడూ ||2||
పంచుకోవాలి పరవారితో ||మారిపోవాలి||
మనము వెలగాలి ఒక దివ్య వెలుగై ||2||
వెలిగించాలి ఈ జగతినంతా ||2||
కదలి రావాలి కరుణంత మనలో ||2||
కరిగిపోవాలి కఠినాత్ములంతా ||2|| ||మారిపోవాలి||
మనము బ్రతకాలి విలువైన బ్రతుకు ||2||
బ్రతికించాలి ప్రభుయేసు బోధ ||2||
ఆదుకోవాలి నర జాతినంతా ||2||
అందించాలి ప్రభు వాక్యమెంతో ||2|| ||మారిపోవాలి||
మనము నిలవాలి మాదిరిగా ఎప్పుడూ ||2||
మహిమ పొందాలి ప్రభు యేసు అప్పుడూ ||2||
వినిపించాలి మన సాక్ష్యమంతా ||2||
కదిలించాలి హృదయాలనంతా ||2|| ||మారిపోవాలి||
--Maaripovali ee lokamantha--