మారని దేవుడవు నీవేనయ్యా

Telugu Christian Song

మారని దేవుడవు నీవేనయ్యా - మరుగై ఉండలేదు నీకు యేసయ్యా సుడులైనా సుడిగుండాలైనా - వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా -2 1. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే - 2 మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా - 2 "మారని" 2. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే - 2 నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచూ నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా - 2 "మరని" --Maarani devudavu neevenayaa--
Telugu
1 views