మధురం అమరం నీ ప్రేమ

Telugu Christian Song

మధురం అమరం నీ ప్రేమ యేసు అమృత ధార నీ కరుణ అగాధ సముద్రము ఆర్పజాలనిది నదీ ప్రవాహము ముంచి వేయనిది రక్షణ మార్గం నీ దివ్య వాక్యం పాపికి విడుదల నీ సిలువ 1. నిన్ను నేను చేరలేని ఘెరపాపమందుండగా నన్ను నీలో చేర్చుకొనుటకై నీ రక్తాన్నే కార్చితివే నీ ప్రేమే మాటే కాదు అది క్రియలతోను నన్ను ఫలియింపజేయుచున్నది నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్ను ఎల్లవేళలలో నేను స్తుతియింతును 2. నా యందు నీకు ఉన్న ప్రేమ ఈ లోకాన్ ఉన్న ప్రేమ కన్న ఈ లోక సౌఖ్యాలకన్న ఎంతో శ్రేష్ఠమైనది ఆ ప్రియమైన ప్రేమతో జీవింపజేయుచు నన్ను నడిపించుచున్నావయ్యా నా కీర్తన నా జీవితం నా సర్వము నీకే ఎల్లవేళలలో నేను చెల్లింతును --Madhuram amaram nee
Telugu
12 views