మధురమైనది నా యేసు ప్రేమ

Telugu Christian Song

మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతిమధురం నా ప్రియుని ప్రేమ ప్రేమ. . ప్రేమ. . నా యేసు ప్రేమ 1. ఇహలోక ఆశలతో అంధులమైతిమి నీ సన్నిధి విడచి నీకు దూరమైతిమి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీ సన్నిధిలో నిలపిన నీ ప్రేమ మధురం 2. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గములుచూపి మన్నించితివి మరణపు ఛాయలే దరి చేరనీయక నీలో నను నిల్పిన నీ ప్రేమ మధురం --Madhuramainadi naa yesu prema--
Telugu