మహిమ నీకే ప్రభూ

Telugu Christian Song

మహిమ నీకే ప్రభూ – ఘనత నీకే ప్రభూ (2) స్తుతి మహిమ ఘనతయు – ప్రభావము నీకే ప్రభూ (2) ఆరాధనా… ఆరాధనా… (2) ప్రియ యేసు ప్రభునకే – నా యేసు ప్రభునకే ||మహిమ|| సమీపింపరాని తేజస్సునందు – వసియించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే – నీ సర్వము నాకిచ్చితివే (2) ||ఆరాధనా|| ఎంతో ప్రేమించి నాకై ఏతించి – ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి – నన్ను విమోచించితివే (2) ||ఆరాధనా|| ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి – నను పిలచి వెలిగించితివే నీ గుణాతిశయముల్‌ ధరనే ప్రచురింప – ఏర్పర్చుకొంటివే (2) ||ఆరాధనా|| --Mahima neeke prabhu ghanatha neeke prabhu--
Telugu