మహిమ స్వరూపుడా - మృత్యుంజయుడా

Telugu Christian Song

మహిమ స్వరూపుడా - మృత్యుంజయుడా మరణపుముల్లును విరిచినవాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు 1. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించినావు నీ గాయములద్వారా స్వస్థతనొంది అనందించెద నీలో నేను ||మహిమ స్వరూపుడా|| 2.విరిగిన మనస్సు నలిగినా హృదయం నీ కిష్టమైన బలియాగముగా నీ చేతితోనే విరిచిన రోట్టెనై ఆహారమౌదును అనేకులకు ||మహిమ స్వరూపుడా|| 3. పరిశుద్ధత్మ ఫలముపొంది పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై సీయోను రాజా నీ ముఖము చూడ ఆశతో నేను వేచియున్నాను ||మహిమ స్వరూపుడా|| --Mahima swaroopuda mruthyunjayudaa--
Hosanna ministries
Telugu