మహిమాన్వితము మనోహరము

Telugu Christian Song

మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము (2) నిన్నే కోరానయ్య – నిన్నే చేరానయ్య నీవే కావాలని యేసయ్య (2) ||మహిమాన్వితము|| కోరలేదు ధన సంపద కోరినాను నిను మాత్రమే (2) ఐశ్వర్యము కంటే అధికుడవు (2) నీ ఆశ్రయమే చాలునయా (2) ||నిన్నే|| జీవపు ఊటలు కల చోటికి జీవ నదులు పారే చోటికి (2) ప్రేమతో పిలచిన నా యేసయ్యా (2) నా దాహమును తీర్చెదవు (2) ||నిన్నే|| తేజోనివాసుల నివాసము చేరాలనునదే నా ఆశయ్యా (2) యుగయుగములు నే నీతో ఉండి (2) నిత్యారాధన చేయాలని (2) ||నిన్నే|| --Mahimanvithamu manoharamu--
Telugu