మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట

Telugu Christian Song

మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది ||మహోన్నతుడా|| 1. మోడుబారిన జీవితాలను చిగురింప జేయగలవు నీవు (2) మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు (2) ||మహోన్నతుడా|| 2. ఆకు వాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలియించినా (2) జీవ జలముల ఊట అయిన నీ ఓరన నను నాటితివా (2) ||మహోన్నతుడా|| 3. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా (2) వాగ్ధాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా (2) ||మహోన్నతుడా|| --Mahonnathuda nee krupalo nenu nivasinchuta--
Hosanna ministries
Telugu
1 views