మిన్నయైన ప్రేమ చూపిన యేసయ్యా

Telugu Christian Song

మిన్నయైన ప్రేమ చూపిన యేసయ్యా ఎన్నడైన భూమి చూడని మనసయ్యా ఎంతగానో ఓర్చితివే వింతగా క్షమించితివే మిన్నకుండలేము యేసయ్యా కనుగొని నీ ప్రేమను ఎన్న తరమే కాదయ్యా లోతైన ఆ ప్రేమను ద్రోహము చేసి దోషము మోపిరి కేకలు వేసి సిలువకు నెట్టిరి పండ్లు కొరికి చెంపలు పెరికిరి ముండ్లను గుచ్చి మోమున ఉమ్మిరి శ్రమ పెట్టిన కొలది క్షమ పుట్టుట సాధ్యమా నరుడని ఎంచి హేళన చేసిరి శక్తిని ప్రశ్నించి నిను శంకించిరి సవాలు విసిరి అవమానించిరి ఛీత్కరించి వెకిలిగ నవ్విరి సామర్థ్యము కలిగీ సహియించుట సాధ్యమా అలసిన నిన్ను బహు విసిగించినా ఓటమి పాలై నిరాశ పరచినా ఫలములు లేని తీగెగా మిగిలినా మరలా మరలా నిను సిలువేసినా వేధించిన కొలది ప్రేమించ
Telugu
11 views