మంగళమే యేసునకు - మనుజావతారునకు(3x)
శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే
...మంగళమే...
1. పరమపవిత్రునకు - వరదివ్యతేజునకు(3x)
నిరుపామనందునకు (2x)- నిపుణవైద్యునకు - మంగళమే
...మంగళమే...
2. దురిత సంహారునకు - వరసుగుణోద్ధారునకు (3x)
కరుణా సంపన్నునకు (2x) - జ్ఞాన దీప్తునకు మంగళమే
...మంగళమే...
3. రాజులపై పాజునకు - రవి కోటి తేజునకు (3x)
బూజార్హ పదాబ్జునకు (2x) - భువనావన మీకు మంగళమే
...మంగళమే...
4. సత్యప్రవర్తనకు - సద్ధర్మశీలునకు (3x)
నిత్య స్వయం జీవునకు (2x) - నిర్మలాత్మునకు మంగళమే
...మంగళమే...
--Mangalame yesunaku--