మన పట్టణంబదిగో - మన

Telugu Christian Song

మన పట్టణంబదిగో - మన పౌరత్వంబదిగో కానాను పురమదిగో - మన యేసుకు జేయునమో 1. ఆర్భాటంబులతో - విజయోత్సవంబులతో ఏతెంచిన ప్రభు జేరి - పాత భక్తుల జేరి మధ్యాకాశంబుననూ - హల్లెలూయా పాడెదము 2. జీవ జలనది - పారు నాసనమునుండి ఆవల నీవలనూ - జీవ వృక్షంబుండు నెల నెల కాయును - పండ్రెండు కాపులను 3. నూతన భువియందు - నూతన యెరూషలేముండు నూతన వెలుగుననూ - నూతన ప్రజలౌదుము నూతనాలయము - గొఱ్ఱెపిల్లయే తాను 4. తేజోమయునితో - మరి తేజోవాసులతో తేజరిల్లుదుము - తేజో రాజ్యమునందు సజీవ జనకుని - సజీవ జనులమని 5. చేరుదు మాపురము - పరమ పరదైసునకు కరువు మరణములు - కానము ఎన్నడును మహిమలో నిత్యంబు - ప్రభు యేసుతో నుందుము --Mana pattanam badigo
Telugu