మనస్సార కృతజ్ఞత లిడుచు

Telugu Christian Song

మనస్సార కృతజ్ఞత లిడుచు ఘనంబు చేయు ప్రభున్ 1. విరివిగ నాశీర్వాదము లొసగున్ మరువకు యేసుని యుపకారం ధర నీకున్నది దేవునిదే యని కోరిన ప్రబుకిడు త్వరపడుచు - ఘనంబు 2. దర్శించిన నీ దయగల ప్రభువునకు హర్షముతో కొట్లను విప్పి విరివిగ మురియుచు ప్రభునకు అన్నియు అర్పించి కొనియాడెదము - ఘనంబు 3. తనయునిలో మన కన్నియు నిడెను మనలను ముందే తనకిడెను పానార్పణముగ ప్రభుకర్పించి కాలంబంతయు గడిపెదము - ఘనంబు 4. సంతసముగ నిడుటే ప్రభు చిత్తము ఎంతో మెళకువతో నుండి చింతింపక నిడుటే సరియర్పణ వింతగు వృద్ధిని పొందెదము - ఘనంబు 5. పిసినితనంబుగ దోషార్పణ నిడ వాసము చేయును లేశములు యేసునికి నీ జీవనమియ్యను శాసనమిదె ప్రభుదని యెరుగు - ఘనంబు
Telugu