మరియా తనయుడై – మనుజావతారుడై

Telugu Christian Song

మరియా తనయుడై – మనుజావతారుడై మహిలోన వెలసెను – మనకొరకై జన్మించెను “ఆనందమానందమే – లోకానికి శుభదినమే ఆనందమానందమే – సర్వసృష్టికి సంతోషమే” 1. ఒక దూత తెలిపెను – గొల్లలకు శుభవార్తను ఒక తార వెలిసెను – రారాజుని ప్రకటించెను 2. బెత్లెహేము పురములో – దావీదు వంశంబులో రక్షకుడు వెలసెను – మన పాపము తొలగించెను 3. రాజులకే రాజుగా – ప్రభువులకే ప్రభువుగా ఇమ్మానుయేలుగ – యేసయ్య జన్మించెగ --Mariya thanayudai manujaavatharudai--
Telugu
1 views