మరువని నీదు ప్రేమతో

Telugu Christian Song

మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2) ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా పొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2) ||మరువని|| కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపె వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె (2) పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములు ఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము (2) ||మరువని|| నిన్న నేడు ఎన్నడైనా మారిపోని మనసు నీది తల్లి మరచినా మరచి పోక కాపు కాసే ప్రేమ నీది (2) పొందుకున్న జన్మ దినము నీవు ఇచ్చే దయా కిరీటము నీవు ఇచ్ఛే వాగ్ధానాలు చేయు అధికము బ్రతుకు దినములు (2) ||మరువని|| --Maruvan
Telugu