దివ్యతేజోమయా యేసయ్యా
నీతి నియమాలకు నిలయమా
నినునమ్ము నీజనుల - న్యాయాధిపతి నీవై
నడిపితివి జయధ్వజముతో
నిత్యం నీకే నా ఆరాధన
నీవే నీవే నా స్తుతికీర్తన
బలవంతుడా మహాశూరుడా - పలుశోధనలలో నాతోడై
నా కుడి పార్శ్వమందుండినావే
నీ మహిమకై నీవేర్పరచిన - నీ పాత్రగా నను మార్చినీవు
నీ ఎనలేని ప్రేమను చూపితివి
నీవే నీవే నా విజయం - నాలో నీవే నీవే ఆనందం
నీవే నీవే నా విజయం - నాలో నీవే నీవే మహదానందం
అభిషిక్తుడా నా ప్రాణేశ్వర - నా నీడవలె నాతోనుండి
నను రక్షించి పోషించినావు
నేనెన్నడూ నాకై ఆశించని - నీ దీవెనలతో తృప్తిపరచి
నన్నీస్థితిలో నీవు నిలిపినావు
నీవే నీవే నా ప్రాణం - నాలో నీవే నీవే నా ధ్యానం
నీ వాక్యమే నన్