నా చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి

Telugu Christian Song

నే తెరిచే తలుపులన్నీ తరచుగా మూసితివి కోపించి పగనుంచినా నవ్వుతూ చూసితివి నే తలిచే మార్గములన్నీ తరచుగా మూసితివి కన్నీళ్లతో దుఃఖించినా కౌగిలిలో దాచితివి మూయుటకు కారణం ఈ మూర్ఖునికి తెలిసినదే అడిగిన దానికంటే అధికమే పొందితినే మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే అడిగిన దానికంటే ఎక్కువే పొందితినే నా చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి కోరికలన్నీ తీర్చితివి మూర్ఖునని నీవెరిగినా కౌగిలిలో బంధించితివి ఆశలన్నీ ఎరిగితివి కోరికలన్నీ తీర్చితివి మూఢుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివి 1. తండ్రులెవరైననూ చేపనడిగితే పామునిచ్చునా తండ్రీ నిన్ను దయ మాత్రమే వేడితిని నీకు వేరుగా నేను ఏదియు కోరలేను ఆశలే నా ఊసై తాకనీ జనుల మనసున
Giftson Durai
Telugu