నా దాగుచోటు నీవే

Telugu Christian Song

నా దాగుచోటు నీవే యేసయ్యా నా విచారములు కొట్టివేసి ఆనందము కలుగజేసితివి నా హృదయములో నదివలె సమాధానమే నలుదిశల నెమ్మదిని కలుగజేసితివే తగిన సమయములో హెచ్చించునట్లు నను దాచి కాచితివి దీనమనసు కలిగి జీవింప నీ కృప నిచ్చితివి నా చింతలన్ని బాపి నీ శాంతితో నింపితివి ఆపత్కాలములో పర్ణశాలలో నను నీవు దాచితివి నా సహాయకుడ నీవని నే నాట్యమాడి కీర్తింతును నా జీవితకాలమంతయు నీ సన్నిధిని నివసింతును అగ్ని శోధనలు నను చుట్టుకొనగా దాచితివి నీ కౌగిలిలో స్నేహబంధముతో బంధించి నను ప్రేమించితివి జేష్టుల సంఘముకై నను సిద్ధపరచితివి --Naa daagu chotu neeve yesayya--
Telugu