నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
సుడిగాలిలో నైనా జడివానలోనైనా
ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము
1. ఆరని దీపమై దేదీప్యమానమై
నాహృదయ కోవెలపై దీపాల తోరణమై
చేసావు పండగ వెలిగావు నిండుగా
2. మారని నీ కృప నను వీడనన్నది
మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది
మ్రోగించుచున్నది ప్రతిచోట సాక్షిగా
3. ఆగని హోరులో ఆరిన నేలపై
నాముందు వెలసితివే సైన్యములకధిపతివై
పరాక్రమశాలివై నడిచావు కాపరిగా
--Naa deepamu yesayya neevu--