నా దేవుని కృపవలన

Telugu Christian Song

నా దేవుని కృపవలన సమస్తము సమకూడి జరుగును (2) నాకు లేమి లేనే లేదు అపాయమేమియు రానే రాదు (2) ||నా దేవుని|| కరువులో కష్టాలలో ఆయనే నన్ను బలపరుచును (2) ఆయనే నన్ను బలపరుచును ఆయనే నన్ను ఘనపరుచును (2) ||నా దేవుని|| శ్రమలలో శోధనలో ఆయనే నాకు ఆశ్రయము (2) ఆయనే నాకు ఆశ్రయము ఆయనే నాకు అతిశయము (2) ||నా దేవుని|| ఇరుకులో ఇబ్బందిలో ఆయనే నన్ను విడిపించును (2) ఆయనే నన్ను విడిపించును ఆయనే నన్ను నడిపించును (2) ||నా దేవుని|| --Naa devuni krupa valana--
Telugu
1 views