నా గీతారాధనలో

Telugu Christian Song

నా గీతారాధనలో-యేసయ్యా నీ కృప ఆధారమే నా ఆవేదనలలో-జనించెనే నీ కృపాదరణ 1.నీ కృప నాలో వ్యర్థము కాలేదు- నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే ||నా గీతా|| 2.చేనిలోని పైరు చేతికిరాకున్నా- ఫలములన్ని రాలిపోయిన సిరిసంపదలన్నీ దూరమైపోయిన-నేను చల్లించనులే నిశ్చలమైన రాజ్యముకొరకే- ఎల్లవేళల నిన్నే ఆరాధింతునే ||నా గీతా|| 3.ఆత్మాభిషేకం-నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే ఆత్మతో సత్యముతో ఆరాధించుచు-నే వేచియుందునే నీ రాకడకై ||నా గీతా|| --Naa geetharadhanalo yesayya--
Telugu