నా హృదయాన కొలువైన

Telugu Christian Song

నా హృదయాన కొలువైన – యేసయ్యా నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో – ప్రాణమిల్లేదనే నీ సన్నిధిలో పూజార్హుడా అగ్ని ఏడంతలై – మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడే నే నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే నా స్తోత్రబలులన్నీ నీకేనయ్యా అంతా వ్యర్థమని – వ్యర్థులైరెదరో నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెను నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృదిచేసింది నీవే కదా
Telugu