నా హృదయమా - నా ప్రాణమా ..
నా శ్వాసతో - అనుబంధమా ..
నా కొరకే నరరూపివై - నా పాప భారము మోసి
నా కొరకు బలియైనది నీవే - నా యేసయ్యా….
చరణం 1:
చిందిన నీ రక్తం - పారెను సెలయేరై
చీల్చ బడిన దేహం - ఓర్చెను ఆ భారం
శిక్షకుపాత్రుడనైన - నను రక్షించుటకా
చిత్రవధ చేసిన - మౌనిగ నిలిచినది
ఎవరు - నాపై - చూపని ప్రేమే కదా
ప్రేమామయా - తేజోమయా…
నీ ప్రేమ ఎంతో బలము
నీ త్యాగమెంతో ఘనము
నీ ప్రేమకు నే రుణపడి ఉన్నాను - నా యేసయ్యా
చరణం 2:
చేదు చిరకనిచ్చి - నిను అవమానించిరిగా
స్వార్థ పరుల అహమే - గెలిచిన ఆవేళ
తులువలనే క్షమించెను - నీ దైవత్వము
తుదిశ్వాసవరకు ప్రేమించెను నీ దాతృత్వము
నీకే నీకే అది సాధ్యమైనది
ప్రేమామయా - తేజోమయ