నా హృదయములో నీ మాటలే

Telugu Christian Song

నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతిరేఖలు |2| కారు చీకటిలో కలువరి కిరణమై కఠినహృదయమును కరిగించినావు నీ కార్యములను వివరింపతరమా ? నీ ఘనకార్యములు వర్ణింపతరమా ? 1.మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలె కృపను కురిపించితివి|2| విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు 2.విరజిమ్మె ఉదయకాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి |2| అగ్నిశోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు ఆర్పజాలని జ్వాలగా చేసి ద్వీపస్థంభముపై నను నిలిపినావు 3.పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితం చేయుటకు |2| పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన
Telugu