నా హృదయమును పరీక్షించుము దేవా
నా అంతరంగమును పరిశోధించుము (2)
నన్ను పరిశీలించి నా ఆలోచనలను తెలిసికొనుము
నాలో ఏదైన చెడు మార్గము ఉన్నదో లేదో చూడుము (2)
నా హృదయము సృజించుము దేవా
నాలో స్థిరమైన ఆత్మను నూతనము చేయుము (2)
నన్ను నీ సన్నిధి నుండి తొలగింపకుము
నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకుము (2) ||నా హృదయమును||
నీ రక్షణ ఆనందమును నాకు మరల దయచేయుము
స్వేచ్ఛా స్ఫూర్తితో నన్ను ఆదరించుము (2)
అప్పుడు అతిక్రమించినవారికి నీ మార్గములను బోధింతును
పాపులు నీ యొద్దకు తిరిగి వచ్చెదరు (2) ||నా హృదయమును||
--Naa hrudayamunu pareekshinchumu deva--