నా జీవిత భాగస్వామి

Telugu Christian Song

నా జీవిత భాగస్వామి – నా ప్రియ యేసు స్వామి నా జీవిత భాగస్వామి – ప్రియ వరుడా యేసు స్వామి యేసయ్యా నా స్తుతి పాత్రుడా – యేసయ్యా నా ఘననీయుడా యేసయ్యా నా మహనీయుడా – యేసయ్యా నా ఆరాధ్యుడా (2) అరచేతిలో చెక్కావు – నీ శ్వాసతో నింపావు జీవాత్మగ నను చేసి సృష్టించావు (2) ప్రతిగా నీకేమివ్వగలనేసయ్యా నా సమస్తముతో ఆరాధింతును (2) ||యేసయ్యా|| అమితముగా ప్రేమించి – ప్రాణమునే అర్పించి నీ వధువుగా నన్ను స్వీకరించావు (2) నీ ఋణమెలా తీర్చగలనేసయ్యా నా జీవితముతో ఆరాధింతును (2) ||యేసయ్యా|| --Naa jeevitha bhaaga swamyvi neevu--
Telugu